విధులు నిర్వర్తించిన డాక్టర్‌కి కరోనా.. ఫ్లాట్‌కి రానివ్వని అపార్ట్‌మెంట్ వాసులు

విధులు నిర్వర్తించిన డాక్టర్‌కి కరోనా.. ఫ్లాట్‌కి రానివ్వని అపార్ట్‌మెంట్ వాసులు

తమ ప్రాణాలను ఫణంగా పెట్టి కరోనా పేషెంట్లను కాపాడుతున్నారు వైద్యులు, వైద్య సిబ్బంది. ఈ క్రమంలో చాలా మంది వైద్య సిబ్బంది వైరస్ బారిన పడుతున్నారు. కొందరు చికిత్స తీసుకుని కోలుకుంటున్నారు. మరి కొందరు మృత్యువొడిని చేరుకుంటున్నారు. కోవిడ్ రోగులకు చికిత్స అందిస్తున్న వైద్యుల పట్ట కొందరు పూలు చల్లి కతజ్ఞత కనబరుస్తుంటే.. మరికొన్ని చోట్ల వైద్యులు వివక్షకు గురవుతున్నారు. వారిపై దాడులు చేస్తూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు.

తాజాగా ఢిల్లీలో కరోనాను జయించిన ఒక వైద్యురాలిపై పక్క ప్లాట్ వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆమె ఇంట్లో ఉండగానే బయట నుంచి లాక్ చేశాడు. దక్షిణ ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న వైద్యురాలు హాస్పిటల్‌లో కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ఆ సమయంలో ఆమెకూ కరోనా సోకడంతో వైఎంసీఏ ఐసోలేషన్ వార్డులో చికిత్స తీసుకున్నారు. చికిత్స అనంతరం రిపోర్టులు నెగెటివ్‌గా రావడంతో ఇంటికి చేరుకున్నారు.

పక్క ప్లాట్ వ్యక్తి ఇంటికి రావద్దొంటూ గొడవ చేశాడు. డాక్టర్ ఎంత చెప్పినా వినిపించుకోలేదు. దాంతో ఆమె ఆ వ్య్తక్తిని దాటుకుని తన ఫ్లాట్‌లోకి వెళ్లి తలుపు వేసుకున్నారు. ఈ లోపు సదరు వ్యక్తి బయట నుంచి లాక్ పెట్టాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లి పోమంటూ గొడవ చేశాడు. ప్రస్తుతం ఫ్లాట్‌లో ఒంటరిగా ఉంటున్నానని, తన భద్రత గురించి భయంగా ఉందని వైద్యురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story