మాస్క్ ధరించకుండా మాటలేమిటి? కరోనా కావాలంటే..

మాస్క్ ధరించకుండా మాటలేమిటి? కరోనా కావాలంటే..

తుమ్మినా, దగ్గినా కర్ఛీప్ అడ్డం పెట్టుకోమని ఎన్ని సార్లు చెప్పినా విన్లేదు.. ఇప్పుడు కరోనా పుణ్యమా అని మాట్లాడినా మాస్క్ కంపల్సరీ అని అంటున్నారు. మాట్లాడేటప్పుడు వెలువడే చిన్న చిన్న తుంపరల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందని అనేక పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. మాట్లాడినప్పుడు నోటి నుంచి వెలువడే తుంపరలు దాదాపు ఎనిమిది నిమిషాల పాటు గాలిలో ఉంటాయని 'నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ అండ్ డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్ అండ్ ది యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా' శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మాట్లాడేటప్పుడు నోటి నుంచి ఒక సెకనుకు వేలాది తుంపరలు వెలువడతాయని 'హైలీ సెన్సిటివ్ లేజర్ లైట్ స్కాటిరింగ్ అబ్జర్వేషన్' తేల్చి చెప్పింది. వీటి ద్వారానే ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. మాస్కులు లేకుండా మాట్లాడేవారు ఇతరులను కచ్చితంగా ప్రమాదంలో పడేస్తారని శాస్త్రవేత్త న్యూమాన్ అంటున్నారు. అందుకే మాస్క్ ధరించడం అనేది జీవితంలో భాగం చేసుకోమంటున్నారు. కరోనా అయినా మరే వైరస్ అయినా మన నుంచి దూరంగా వెళ్లాలంటే మాస్క్ పెట్టుకోవాల్సిందే అంటున్నారు.

Tags

Read MoreRead Less
Next Story