మెడికల్ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. భయంతో బయటకు పరుగులు తీసిన సిబ్బంది

X
TV5 Telugu15 May 2020 5:12 PM GMT
ఒంగోలు సమీపంలోని పేర్నమిట్ట మినోఫాం ఔషధ తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం జరిగింది. ఉవ్వెత్తున ఎగిసి పడుతోన్న మంటలకు తోడు దట్టంగా పొగలు కమ్ముకోవడంతో సిబ్బంది బయటకు పరుగులు తీశారు. ఫ్యాక్టరీలోని జనరేటర్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో.. ఫ్యాక్టరీ మొదటి,రెండో అంతస్తులో దట్టంగా పొగలు వ్యాపించాయి. శానిటైజర్లు తయారు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. శానిటైజర్లలో ఉపయోగించే ఆల్కహాల్ కారణంగానే అగ్నిప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఈనేపథ్యంలో..ఫ్యాక్టరీలోని ఇతర ఔషధాలను వెంటనే బయటకు తీసుకు వచ్చి సురక్షిత ప్రాంతానికి తరలించారు.
Next Story