చైనాతో ఎందుకు దోస్త్ ఉండాలి: ట్రంప్

చైనాతో ఎందుకు దోస్త్ ఉండాలి: ట్రంప్

వూహాన్‌లో పుట్టిన కరోనా వైరస్‌తో ప్రపంచ దేశాలన్నీ ఎఫెక్ట్ అయినా ఏ ఒక్క దేశం చైనాను ఒక్క మాట అనడానికి సాహసం చేయట్లేదు, కానీ అగ్రరాజ్యం అమెరికా మాత్రం చైనా పేరెత్తితే చాలా అగ్గి మీద గుగ్గిలం అవుతోంది. ఇంతటి అనర్థానికి చైనానే కారణమని ముందునుంచి మొత్తుకుంటూనే ఉంది. ట్రంప్‌కి మరీ మండే విషయం ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా చైనాని సపోర్ట్ చేస్తుంది తప్పించి చేసిన పని తప్పని చెప్పట్లేదు.

ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ట్రంప్ తాజాగా తీవ్ర హెచ్చరిక చేశారు. అవసరమైతే చైనాతో సంబంధాల్ని పూర్తిగా తెగతెంపులు చేసుకోవడానికి కూడా వెనుకాడబోనని హెచ్చరించారు. దీనివల్ల అమెరికాకు 500 బిలియన్ల డాలర్లు ఆదాఅవుతాయని చెప్పుకొచ్చారు. చైనా వ్యవహార శైలి తనకెంత మాత్రం నచ్చలేదని తేల్చి చెప్పారు. మరోవైపు ఇరుదేశాల మధ్య ఇటీవల కుదిరిన తొలిదశ వాణిజ్య ఒప్పందం విషయంలో పునఃచర్చలకు ఆస్కారం లేదని ఆయన స్పష్టం చేశారు.

కొన్నేళ్లుగా అమెరికాను చెనా కొల్లగొడుతోందని, దీన్ని భవిష్యత్తులో కొనసాగనిచ్చేది లేదని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాల నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్తో చర్చలు జరపడానికి తానేమాత్రం సిద్దంగా లేదని స్పష్టం చేశారు. చైనాపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని గత కొన్ని రోజులుగా అమెరికా కాంగ్రెస్ సభ్యులు ట్రంప్‌పై ఒత్తిడి తీసుకువస్తున్నారు. మహమ్మారి విషయంలో నిజాల్ని నిగ్గుతేల్చకపోతే చైనాపై కఠిన ఆంక్షలు విధించాలని ప్రతిపాదించారు.

Tags

Read MoreRead Less
Next Story