మా మంచి ఆఫీసర్.. మాకు ఆయనే కావాలి

మా మంచి ఆఫీసర్.. మాకు ఆయనే కావాలి
X

సినిమాల్లో జరిగే సంఘటనలు నిజ జీవితంలో కూడా జరుగుతున్నాయంటే నిజంగానే ఆయనెంత మంచి పోలీసాఫీసర్ అయి ఉండాలి. మహరాష్ట్ర పాల్‌ఘర్ జిల్లా వాసులు ఎస్పీ గౌరవ్‌ని సెలవుపై పంపిస్తే ఒప్పుకోలేదు. నిజాయితీగా పని చేస్తున్నఎస్పీని మహారాష్ట్ర హోం మినిస్టర్ అనిల్ దేశ్ ముఖ్ సెలవుపై వెళ్లాల్సిందిగా ఆదేశించారు. అయితే గ్రామస్తులు మాత్రం ఆయన్ను వెనక్కు తీసుకురావాలంటూ ఆన్‌లైన్‌లో క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు.

పాల్‌ఘర్ మూకదాడులకు సంబంధించి ఎస్పీ గౌరవ్ సింగ్ని అత్యవసర సెలవు తీసుకుని వెళ్లాల్సిందిగా మహారాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించింది. గౌరవ్ వచ్చినప్పటి నుంచి జిల్లాలో ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, గుట్కా లాంటివన్నీ అరికట్టారని గ్రామ ప్రజలు తెలిపారు. ఆయన రాకతో ప్రజలకు, పోలీసులకు మధ్య మంచి బంధం ఏర్పడిందని చెప్పారు. ఇంత మంచి పోలీసాఫీసర్‌ని మునుపెన్నడూ చూడలేదని, ఆయన్ని మేం వదులుకోమని గ్రామస్తులంతా ఒక్కటై పోరాడుతున్నారు. మళ్లీ ఎస్పీగారు తమ జిల్లాకే రావాలని హోం మినిస్టర్‌ని వేడుకుంటున్నారు.

Next Story

RELATED STORIES