టీవీ5 కథనాలతో బెంబేలెత్తిన గడ్డం గ్యాంగ్‌

టీవీ5 కథనాలతో బెంబేలెత్తిన గడ్డం గ్యాంగ్‌

కృష్ణా జిల్లా గుడివాడలో గడ్డం గ్యాంగ్‌ భూ కబ్జాలపై టీవీ5 ప్రసారం చేసిన కథనాలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.. కబ్జా పర్వంపై టీవీ5 వరుస కథనాలు ప్రసారం చేసింది.. దీంతో కబ్జా భూముల్లోంచి గడ్డం గ్యాంగ్‌ పలాయనం చిత్తగించింది.. అటు గడ్డం గూండా కూడా పత్తా లేకుండా పోయాడు.. కబ్జా చేసిన 9 ఎకరాల భూమిలో ముళ్లకంచె వేసి గూండాలను కాపలా పెట్టగా.. వారంతా ఇప్పుడు టీవీ5 కథనాలతో పలాయనం చిత్తగించారు. గడ్డం గూండాల కబ్జా కోరల్లోంచి బాధితులను కాపాడిన టీవీ 5.. వారిని ఆ భూముల్లోకి తీసుకెళ్లింది.

ఇంతకాలం గడ్డం గ్యాంగ్‌కు భయపడి చేతులెత్తేసిన పోలీసులు.. టీవీ 5 కథనాలతో స్పందించారు. గడ్డం గ్యాంగ్‌ అక్రమాలపై ఐపీసీ సెక్షన్‌ 441, 427 ప్రకారం.. గుడివాడ తాలూకా పోలీస్‌ స్టేషన్‌లో కేసులు నమోదు చేశారు. మరోవైపు టీవీ 5 కథనాలతో గడ్డం గ్యాంగ్‌ సభ్యుల్లోనూ గుబులు మొదలైంది. ఇంతకాలం నా మాటే వేదం.. నేను చెప్పిందే శాసనం అన్న గడ్డం గూండా పత్తా లేకుండా పోయాడు. అలాగే గడ్డం గ్యాంగ్‌ కూడా కబ్జా భూముల్లో నుంచి పలాయనం చిత్తగించింది. కబ్జా భూముల్లో గూండాలు వేసిన టెంట్లను సైతం తొలగించేశారు. ఇన్నాళ్లూ కబ్జా భూముల్లో అరాచకాలు సృష్టించిన కాపలా గూండాలు సైతం అడ్రస్‌ లేకుండా పోయారు.

బాధితుల్లో ఒక్కొక్కరిది ఒక్కో వేదన.. కష్టపడి కొనుక్కున్న భూమిని గడ్డం గ్యాంగ్‌ కబ్జా చేయడంతో ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాని బాధితులు ఇన్నాళ్లూ మౌనంగా ఉండిపోయారు.. టీవీ 5 ఈ కబ్జా పర్వాన్ని వెలుగులోకి తీసుకురావడం, పోలీసులు దిగివచ్చి కేసులు నమోదు చేయడంతో బాధితులంతా ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. టీవీ5 చొరవతో ధైర్యంగా ముందుకొచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తున్నారు. టీవీ5 కి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story