క్వారంటైన్ నుంచి బయటకి వస్తామంటూ ఆందోళన

క్వారంటైన్ నుంచి బయటికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ ఆందోళనకు దిగారు బాధితులు. గుంటూరు జిల్లా తాడేపల్లిగూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సీఎం నివాసానికి సమీపంలో ఉన్న మారుతి అపార్ట్మెంట్ లో 28 రోజుల క్రితం పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో అపార్ట్ మెంట్ వాసులను హోం క్వారంటైన్ లో ఉంచారు. అయితే 28 రోజుల గడువు ముగియటంతో తమను బయటికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని అపార్ట్ మెంట్ వాసులు కోరుతున్నారు. నిత్యావసరాలు అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. ఆపార్ట్మెంట్ వాసుల ఆందోళనతో అలర్టైన పోలీసులు..అపార్ట్మెంట్ వాసులను ఆందోళన విరమించాలని కోరారు. ఇంకా ఎన్ని రోజులు నిర్బంధంలో ఉండాలంటూ అపార్ట్మెంట్ వాసులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అయితే.. రేపట్నుంచి బయటికి వచ్చేందుకు అనుమతిస్తామన్న పోలీసుల హామీతో ఆందోళన సద్దుమణిగింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com