మూడో విడత ప్యాకేజీ వివరాలను ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి

మూడో విడత ప్యాకేజీ వివరాలను ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి
X

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ఆత్మ నిర్భర్ అభియాన్‌లో భాగంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మూడో విడత ప్యాకేజీ వివరాలను ప్రకటించారు. వ్యవసాయ రంగం పునరుత్తేజానికి 11 సూత్రాల ప్రణాళికను ప్రకటించారు. ఇందులో మొదటి 8 కేటాయింపులకు సంబంధించినవి కాగా, 3 అంశాలు ప్రభుత్వ విధానాలు, చట్టాలకు సంబంధించినవి. వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఏకంగా లక్ష కోట్లు కేటాయించారు. వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘాలు, రైతుల ఉత్పత్తి సంఘాలు, వ్యవసాయ ఆధారిత స్టార్టప్ కంపెనీలకు ఈ నిధితో ప్రయోజనం కలగనుంది. ఆహార రంగంలో సూక్ష్మ పరిశ్రమలకు 10 వేల కోట్లు ఇచ్చారు.

మత్స్య పరిశ్రమ అభివృద్ధికి 20 వేల కోట్లు కేటాయించారు. ఆక్వా సాగు, చేపల పెంపకం, చేపల చెరువుల సమగ్ర అభివృద్ధికి ఈ నిధులు ఖర్చు చేయనున్నారు. ఇందులో 11 వేల కోట్లు మెరైన్‌, ఇన్‌ ల్యాండ్ ఫిష‌రీస్‌, ఆక్వాక‌ల్చర్‌కు వెచ్చించనున్నారు. ఫిషింగ్ హార్బర్స్, కోల్డ్ చెయిన్స్‌, మార్కెట్ల కోసం మ‌రో 9 వేల కోట్లు ఖర్చు చేస్తారు. గడువు తీరిన 242 ఆక్వా హేచరీలకు రిజిస్ట్రేషన్ గడువును 3 నెలలు పొడిగించారు. వచ్చే ఐదేళ్లలో 70 లక్షల టన్నుల చేపలను ఉత్పత్తి చేయాల ని లక్ష్యంగా పెట్టుకున్నారు. మత్స్య పరిశ్రమ ద్వారా 55 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని, మత్స్య పరిశ్రమ ఎగుమతుల విలువ లక్ష కోట్లు దాటుతుందని కేంద్రం అంచనా వేసింది.

స్వదేశీ వస్తువులను కొనండి-లోకల్‌కు వోకల్‌గా మారండి అంటూ ఇటీవల ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అందుకు అనుగుణంగా కేంద్ర ఆర్థికమంత్రి కార్యాచరణ ప్రకటించారు. సూక్ష్మ ఆహార సంస్థల కు 10 వేల కోట్ల రూపాయల మేర ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారు. ఈ ప్యాకేజీతో 2 లక్షల మైక్రో ఫుడ్‌ ఎంటర్‌ప్రైజెస్‌కు లబ్ధి చేకూరనుంది. ప్రజల ఆరోగ్య మెరుగుదల, సురక్షిత ప్రమాణాల అభివృద్ధి, రిటైల్‌ మార్కెట్ల అనుసంధానం, ఆర్థిక రాబడుల పెంపును లక్ష్యంగా పెట్టుకున్నారు. FSSAI ప్రమాణాలను అందుకోవడానికి వీలుగా MFEలను సాంకేతికంగా డెవలప్ చేయడం, లోకల్ ప్రొడక్ట్స్‌కు బ్రాండ్ కల్పించి మార్కెట్ సదుపాయాలు కల్పించడం తదితర కార్యక్రమాలు చేపడతారు. రాష్ట్రాలను బట్టి ఉత్పత్తులను ప్రోత్సహిస్తారు. ఈ సందర్భంగా తెలంగాణ పసుపు, ఆంధ్రా మిర్చిని నిర్మల సీతారా మన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ రెండింటింతో పాటు తమిళనాడులో కర్ర పెండలం, ఉత్తరప్రదేశ్‌లో మామిడి, జమ్మూకశ్మీర్‌లో కేసర్, ఈశాన్య భారతంలో వెదురు ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపు ఉందని, ఇలాంటి ఉత్పత్తులను ప్రపంచ స్థాయిలో విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

ఇక, నిర్మల సీతారామన్ ప్రకటనలో మూడు అంశాలు చాలా కీలకమైనవి. అందులో మొదటిది 1955నాటి నిత్యావసరాల చట్టానికి సవరణలు చేయడం. ఈ నిర్ణయం ద్వారా వంటనూనెలు, నూనె గింజ లు, పప్పులు, ఉల్లిపాయలు, బంగాళదుంపలు, టమాటాలకు నిత్యావసర చట్టం నుంచి విముక్తి కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఆయా వస్తువుల నిల్వ విషయంలో ఎలాంటి పరిమితులు ఉం డవు. అలాగే రైతులు తమ పంటలను ధర ఎక్కడ ఎక్కువ వస్తే అక్కడ అమ్ముకునే అవకాశమిచ్చారు. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌లో లైసెన్స్ రాజ్‌కు అడ్డుకట్ట వేశారు. లైసెన్స్ పొందిన వ్యాపారస్తు ల వద్దే రైతులు తమ పంటలను అమ్ముకోవాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా ఎక్కడ మంచి ధర వస్తే అక్కడ పంటలు అమ్ముకోవచ్చు. దీంతోపాటు పండించే పంటకు ఎంత ధర వస్తుందో ముందుగా తెలుసుకునే వెసులుబాటు ఇచ్చారు.

పాడి పరిశ్రమ అభివృద్ధిపై మోదీ సర్కారు ప్రత్యేకంగా దృష్టి సారించింది. పాడి పశువులకు వంద శాతం వ్యాక్సిన్లు వేయడానికి 13 వేల 300 కోట్లు కేటాయించారు. దేశంలో 53 కోట్ల వరకు పాడి పశువులు ఉన్నట్లు అంచనా. ఇప్పటికే దేశంలో కోటి వరకు ఆవులు, గేదెలకు ట్యాగింగ్ పూర్తి చేశారు. అలాగే 2కోట్ల మంది పాడి రైతులకు 5వేల కోట్ల మేర ప్రోత్సాహకాలు కల్పించనున్నారు. సహకార రంగంలోని డెయిరీలకు 2 శాతం వడ్డీ రాయితీ ఇవ్వనున్నారు. పశు సంవర్థక రంగంలో మౌలిక సదుపాయాలకు 15 వేల కోట్లు, ఔషధ పంటలకు 4 వేల కోట్లు, తేనే టీగల సంరక్షణకు 500 కోట్లు కేటాయించారు. 2 లక్షల 25 వేల హెక్టార్లలో ఔషధ పంటలు పండించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా వ్యవస్థకు 500 కోట్లు కేటాయించారు. రవాణ ఖర్చుల్లో 50%, శీతల గోదాముల రుసు ముల్లో 50% రాయితీ ఇచ్చారు. పాడి పరిశ్రమ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించే స్థాయిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి చేస్తామని నిర్మల సీతారామన్ హామీ ఇచ్చారు.

Next Story

RELATED STORIES