కరోనాతో పాటు డెంగీ.. వర్షాకాలంలో వచ్చేస్తుంది..

కరోనాతో పాటు డెంగీ.. వర్షాకాలంలో వచ్చేస్తుంది..
X

దాదాపు రెండు నెలల నుంచి కరోనాతో పోరాటం చేస్తున్నాం. రాబోయేది వర్షాకాలం. ఇంకెన్ని వైరస్‌లను మోసుకొస్తుందో. వర్షాకాలంలో దోమల వ్యాప్తి కూడా ఎక్కువగా ఉంటుంది. గత సంవత్సరం డెంగ్యూ నగర జీవిని గడగడలాడించింది. వందల మంది వ్యాది బారిన పడితే.. పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. వైరల్ జ్వరాలకు కారణమవుతున్న దోమల వ్యాప్తి నిరోధానికి జీహెచ్‌ఎంసీ ఎన్ని చర్యలు చేపట్టినా ఫలితం కానరావట్లేదు.

పురపాలక మంత్రి కేటీఆర్ దోమల నివారణపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే కరోనాను కట్టడి చేయలేక సతమతమవుతున్న తరుణంలో డెంగ్యూ కూడా తోడైతే పరిస్థితి దారుణంగా తయారవుతుంది. ముందస్తు చర్యలు తీసుకుంటే తప్ప వ్యాధి నిర్మూలన అసాధ్యం. దోమకాటు ద్వారా వ్యాపించే మలేరియా, డెంగీ, చికెన్‌గున్యా, జపనీస్ ఎన్కెఫలైటీస్ లక్షణాలు కరోనా లక్షణాలతో సరిపోలుతున్నందున ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులతో పాటు అధికారులు హెచ్చరిస్తున్నారు.

Next Story

RELATED STORIES