అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త

అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త
X

అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పంట ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకునేలా రైతు లకు అవకాశం కల్పించింది. అలాగే పంటలకు ధర విషయంలోనూ సాగుకు ముందే తెలుసుకునే వెసు లు బాటు కల్పిస్తోంది. ఈ మేరకు చట్టాలను సవరించనున్నారు. ఈ నిర్ణయంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హర్షం వ్యక్తం చేశారు.

వాన రాకడ ప్రాణం పోకడ అంచనా వేయలేమని పెద్దలు చెబుతారు. పంటలకు గిట్టుబాటు ధర కూడా అంతే. ఎప్పుడు ధర వస్తుందో, ఎప్పుడు ధర పడిపోతుందో, అసలు రేటు వస్తుందో రాదో ఎవ్వరూ స్పష్టంగా చెప్పలేరు. దీర్ఘకాలికంగా వ్యవసాయరంగంలో పేరుకుపోయిన సమస్యలు, దశాబ్దాల నాటి చట్టాలు, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌లో లైసైన్స్ రాజ్యం, ప్రకృతి వైపరీత్యాలు... అన్నీ కలసి అన్నదాతల జీవితాలను ఛిద్రం చేశాయి. లాభం సంగతి దేవుడెరుగు, అసలు పెట్టుబడి వస్తే అదే పదివేలు అన్నట్లుగా మారిపోయిందీ వ్యవసాయం. ఈ పరిస్థితిని మార్చడానికి కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న మోదీ సర్కారు, కరోనా సంక్షోభ సమయాన్ని అందుకు అనువుగా ఉపయోగించుకుం ది. రైతుల కష్టాలను కాస్తైన తీర్చడానికి మూడు కీలక సంస్కరణలు చేపట్టింది.

ఇకపై రైతులు తమ పంటలను ఎక్కడైనా అమ్ముకోవచ్చు. ఉత్పత్తి, సాగు చేసిన రాష్ట్రం లేదా ప్రాంతంలోనే అమ్ముకోవాలనే రూల్ ఉండదు. ధర ఎక్కడ ఎక్కువ వస్తే అక్కడే పంటను విక్రయించుకోవచ్చు. ఈ మేరకు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌లో లైసెన్స్ రాజ్‌కు అడ్డుకట్ట వేశారు. ఫలితంగా, రైతులకు పంటలు అమ్ముకునే ఆప్షన్లు ఎక్కువగా లభిస్తాయి. మార్కెట్లలో లైసెన్స్ పొందిన వ్యాపారుల వద్దే పంటలను అమ్ముకోవాల్సిన అవసరం ఉండదు. దేశవ్యాప్తంగా ఎక్కడ మంచి ధర వస్తే అక్కడ పంటను అమ్ముకోవచ్చు. వేరే రాష్ట్రాల్లోనూ పంటను విక్రయించుకోవచ్చు. తక్కువ ధరకు పంటను అమ్ముకోవాల్సిన ఆగత్యం తప్పుతుంది. ఈ మేరకు కేంద్రం ఓ చట్టాన్ని తీసుకురానుంది.

Next Story

RELATED STORIES