బ్రతుకే భారం.. బండి లాగడం ఏమంత కష్టం కాదంటూ..

బ్రతుకే భారం.. బండి లాగడం ఏమంత కష్టం కాదంటూ..
X

లాక్డౌన్‌ సడలింపులతో వలస కార్మికులు తమ స్వస్థలాలకు చేరుకుంటున్నారు. కాళ్లకు పని చెప్పే వారు కొందరైతే, ఏదో ఒకటి ఎక్కేసి ఊరికి చేరుకోవాలనే ఆత్రుత మరి కొందరికి. ఈ క్రమంలో ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. కళ్లు చెమర్చే దృశ్యాలెన్నో కళ్ల ముందు కనబడుతున్నాయి. తాజా సంఘటన మరింత హృదయ విదారకంగా ఉంది. మధ్యప్రదేశ్ ఇండోర్ జిల్లాలో వెలుగు చూసింది. రెండెడ్ల బండి.. అదే ఆధారం.. దాన్ని ఆధారంగా చేసుకుని బతుకీడుస్తున్నాడు రాహుల్.

లాక్‌డౌన్‌తో ఉపాధి లేక, ఊరికెళ్లే దారిలేక ఒక ఎద్దుని అమ్మి ఆ వచ్చిన డబ్బుతో ఇన్ని రోజులు బ్రతుకీడ్చుకొచ్చాడు. సడలింపులతో కుటుంబంతో సహా ఊరికి పయనమయ్యాడు. భార్యా బిడ్డల్ని బండి మీద కూర్చోబెట్టి మరో ఎద్దు స్థానంలో తానే కాడిని ఎత్తుకుని బండి లాగుతూ వెళుతున్నాడు. ఆగ్రా, ముంబై జాతీయ రహదారిపై వలస కూలీ రాహుల్ బండి లాగుతున్న దృశ్యం మీడియా కంట పడింది. వీడియో వైరల్ కావడంతో మధ్యప్రదేశ్ మంత్రి తులసీ సిలావత్ స్పందించారు. కూలీ కుటుంబాన్ని ఆదుకోవాలని ఇండోర్ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు.

Next Story

RELATED STORIES