ఏపీలో హద్దులు దాటిన ఎస్సై.. ఆసుపత్రికి వెళ్లి వస్తున్నామని వేడుకున్నా కనికరించలేదు

ఏపీలో హద్దులు దాటిన ఎస్సై.. ఆసుపత్రికి వెళ్లి వస్తున్నామని వేడుకున్నా కనికరించలేదు

లాక్‌డౌన్‌ను సాకుగా చూపిస్తూ.. ఏపీలో పోలీసులు ఇష్టారాజ్యంగా రెచ్చిపోతున్నారు. కనీసం మహిళలనే కనికరం కూడా చూపడం లేదు. కర్నూలు జిల్లా ఆదోనిలో ఓ ఎస్సై తీరే దీనికి నిదర్శనం. పట్టణానికి చెందిన ఓ మహిళ.. తన తల్లికి ఆరోగ్యం బాగా లేకపోతే ఆసుపత్రిలో జాయిన్‌ చేయించాలని వెళ్లింది. అయితే డాక్టర్‌ లేకపోవడంతో.. మరో ఆసుపత్రికి వెళ్లాలని భావించింది. ఆ సమయంలో.. విధులు నిర్వహిస్తున్న త్రీటౌన్‌ ఎస్సై రాజు కుళ్లాయప్ప.. వీరిని ఆపాడు. తల్లికి ఆరోగ్యం బాగాలేదని, తమను విడిచిపెట్టాలని మహిళ ఎంత వేడుకున్నా ఆయన కనికరించలేదు. పైగా ఆమెను బండబూతలు తిట్టాడు. ఎస్సై తీరును స్థానికులు ప్రశ్నించడంతో.. వారిపైనా రెచ్చిపోయాడు. ఈ ఎస్సై తీరుపై మండిపడుతున్నారు స్థానికులు. లాక్‌డౌన్‌ సాకుతో సామాన్యులపై ప్రతాపం చూపిస్తున్నాడంటూ విమర్శిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story