లాక్‌డౌన్ మే31 వరకు పొడిగించిన మరో రెండు రాష్ట్రాలు

లాక్‌డౌన్ మే31 వరకు పొడిగించిన మరో రెండు రాష్ట్రాలు
X

కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇందులో బాగంగానే లాక్ డౌన్ పొడిగించుపోతున్నారు. ఆదివారంతో మూడో దశ లాక్ డౌన్ ముగుస్తుండటంతో.. మరోసారి లాక్ డౌన్ పొడిగించేందుకు కేంద్రం ఆలోచిస్తుంది. అయితే, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు.. కేంద్రంతో సంబందం లేకుండా ఇప్పటికే లాక్ డౌన్ పొడిగిస్తూ.. ఉత్తర్వులు జారీ చేశాయి. తాజాగా ఈ జాబితాలో మహారాష్ట్ర, తమిళనాడు కూడా చేరాయి. లాక్ డౌన్ మే31 వరకు పొడిగిస్తూ.. కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో కూడా కరోనా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. దీంతో కరోనా కట్టడికి లాక్ డౌన్ పొడిగించడం తప్పనిసరి అవుతోంది. మహారాష్ట్రలో 30వేల పైగా కేసులు నమోదు కాగా, తమిళనాడులో కరోనా కేసులు 10వేలకు పైగా నమోదయ్యాయి.

కరోనా వైరస్ బాధిత రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న తమిళనాడు సైతం లాక్‌డౌన్ పొడిగింపు నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ను ఈ నెల 31వ తేదీ వరకూ పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారంతో మూడో విడత లాక్‌డౌన్ ముగియనున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. దీనికి కొద్ది సేపటికి ముందే మహారాష్ట్ర సర్కార్ సైతం లాక్‌డౌన్‌ను ఈనెల 31 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్త ఆర్థిక ప్యాకేజ్ కాకుండా ముంబైకి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని కూడా ఉద్ధవ్ థాకరే సర్కార్ డిమాండ్ చేస్తోంది.

Next Story

RELATED STORIES