పెట్టుబడుల కేంద్రంగా భారత్‌ను మారుస్తాం: నిర్మలా సీతారామన్

పెట్టుబడుల కేంద్రంగా భారత్‌ను మారుస్తాం: నిర్మలా సీతారామన్
X

ప్రధాని మోదీ ప్రకటించిన ఆత్మనిర్భర భారత్ లోని వివరాలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత నాలుగు రోజుల నుంచి వరుసగా ప్రకటిస్తున్నారు. శనివారం కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. రవాణా, టూరిజం రంగాలను అభివృద్ధి చేసే దిశగా కేంద్ర అడుగులు వేస్తుందని ఆమె తెలిపారు. పలు రంగాలు సరళీకరణ విధానాలు కోరుకుంటున్నాయని.. ఒకే దేశం ఒకే మార్కెట్ విధానాన్ని అమలు చేస్తామని ఆమె ప్రకటించారు. భవిష్యత్ లో పోటీని ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. ఉదయ్ పథకంగా ద్వారా చిన్న నగారాలకు కూడా విమాన సౌకర్యం ఏర్పాటు చేశామని అన్నారు. పెట్టుబడులుకు కేంద్రంగా భారత్ మారనుందని.. ఆవిధమైన ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, బీఏఎఫ్ఆర్ అమలులో భారత్ ముందుందని నిర్మలా తెలిపారు. బొగ్గు, సహజ వనరులు, ఎయిర్‌పోర్టులు, ఎయిర్‌స్పేస్‌ మేనేజ్‌మెంట్‌, డిఫెన్స్‌ ప్రొడక్షన్‌, స్పేస్‌, అణుశక్తి రంగాల్లో నూతన సంస్కరణలు తీసుకొని వస్తామని అన్నారు. కేంద్ర పాలిత ప్రాంతాల్లో పవర్‌ డిస్ట్రిబ్యూషన్ ఏర్పాటు చేస్తామని.. రాష్ట్రాల్లో ఇండస్ట్రియల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు.

Next Story

RELATED STORIES