కోర్టు తీర్పుతో వెనక్కు తగ్గిన యూపీ ప్రభుత్వం

కోర్టు తీర్పుతో వెనక్కు తగ్గిన యూపీ ప్రభుత్వం
X

యూపీ ప్రభుత్వం కార్మికులకు సంబంధించి తీసుకు వచ్చని వివాదాస్పద ఉత్తర్వుల విషయంలో వెనక్కు తగ్గింది. పరిశ్రమలలో కార్మికులకు పనిగంటను 8 నుంచి 12కు పెంచుతూ తీసుకొని వచ్చిన ఉత్తర్వులపై తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. ఈ విషయంలో అలహాబాద్ హైకోర్టులో పిల్ దాఖలైంది. దీంతో ఉత్తర్వులు వెనక్కు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం వెనక్కు తగ్గింది.

కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ విధించడంతో ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా నష్టపోయింది. దీంతో పెట్టుబడులును ఆకర్శించి.. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే.. కొన్ని వ్యూహాలు అనుసరించాలని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు పలు కార్మిక చట్టాలను మార్చేశాయి. యోగి సర్కార్ కార్మికులకు రక్షణ కలిగించే 38 చట్టాలను సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఓ అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. ఇందులో బాగంగానే పారిశ్రామిక యూనిట్లలో పరివేళల్లో మార్పులు చేస్తూ.. ఒక ఆర్డర్ జారీ చేసింది. అయితే, హైకోర్టు ఆదేశాలతో ఈ ఆర్డర్ విషయంలో యోగీ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. కార్మిక చట్టాలు సస్పెండ్ చేసిన విషయంలో గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలపై పలు కార్మక సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. అయితే, ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అయిన బీఎంఎస్ కూడా ప్రభుత్వ ఉత్తర్వులను వ్యతిరేకించడం గమనార్హం.

Next Story

RELATED STORIES