కశ్మీర్లో కరోనా.. 5గురు డాక్టర్లకు..

కశ్మీర్లో కరోనా.. 5గురు డాక్టర్లకు..

ఖర్మ కాకపోతే మరేమిటి.. పాపం కంటికి చికిత్స చేయించుకుందామని వస్తే కరోనా అంటుకుంది. అది కాస్తా ఆమె ప్రాణాలు తీసింది. అంతటితో కరోనా అంతమవ్వలా. మరో అయిదుగురు డాక్టర్లకు ఆమె ద్వారా అంటుకుంది. జమ్ముకశ్మీర్‌లో ఒకామె కంటి వైద్యం చేయించుకోవడానికని ఆస్పత్రికి వచ్చింది. అంతలో కరోనా సోకింది. దాంతో ఆమె మృతి చెందింది. ఆమెకు వైద్యం చేసిన అయిదుగురు డాక్టర్లు కరోనా బారిన పడ్డారు.

వివిధ ఆస్పత్రుల్లో వైద్యం అందిస్తున్న డాక్టర్లు అయిదుగురికి కరోనా సోకడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. కరోనా బారిన పడిన వైద్యుల్లో ఎస్ఎమ్‌హెచ్ఎస్ ఆస్పత్రి నుంచి ముగ్గురు, స్కిమ్స్-జేవీసీ ఆస్పత్రి , ప్రభుత్వ డెంటల్ కాలేజీ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. ఈ మూడు ఆస్పత్రులు శ్రీనగర్‌లోనే ఉన్నాయి. కోవిడ్ మహమ్మారిపై పోరుకు ప్రాణాలు ఫణంగా పెట్టి పోరాడుతున్న వైద్యులు, వైద్యసిబ్బంది కరోనా బారిన పడుతున్నారు. కొంత మంది ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ఇది అత్యంత విచారకరం.

Tags

Read MoreRead Less
Next Story