బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్ మేనేజర్.. ఫ్యామిలీలో 30 మందికి..

బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్ మేనేజర్.. ఫ్యామిలీలో 30 మందికి..
X

ఒక్కళ్లతో పోయే వ్యాధి కాదు.. వంద మందని వేంటేసుకుపోతుంది. ఇంట్లో ఒకరికి పాజిటివ్ అని తేలితే ఇంట్లో ఉన్న అందరితో పాటు చుట్టు పక్కల వారు, కలిసిన వారు, మాట్లాడిన వారు అందరికీ ముప్పే. కరోనా తిప్పలు ఎప్పటికి తప్పుతాయి అనేది అధికారులు అంచనా వేయలేకపోతున్నారు. ఈ రోజు కేసులు లేవు అని అనుకోవడానికి లేకుండా పోతోంది.

తాజాగా హైదరాబాద్ నగరంలోని జుమ్మేరాత్‌బజార్ జుంగూర్ బస్తీలో నివసిస్తున్న ఓ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ (38)కి ఈనెల 15న కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. దీంతో అతడి కుటుంబంలోని 30 మందిని ఆస్సత్రులకు తరలించారు. అందులో 14 మందికి పాజిటివ్ అని రిపోర్టులు వచ్చాయి. వాళ్లందరికీ గాంధీలో చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. అయితే బ్యాంక్ మేనేజర్ 60 ఏళ్ల తండ్రి మాత్రం శనివారం చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఇదిలా ఉంటే శివ్‌లాల్ నగర్‌లో నివసిస్తున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగికి ఈనెల 16న పాజిటివ్ అని తేలింది. దాంతో కుటుంబంలోని 21 మందికి పరీక్షలు చేశారు. అందులో ఇద్దరికి పాజిటివ్ అని రిపోర్ట్ రావడంతో చికిత్స తీసుకుంటున్నారు. మిగిలిన వారందరినీ క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.

Next Story

RELATED STORIES