కశ్మీర్ మాదే.. ఎప్పటికీ మాతోనే ఉంటుంది: అఫ్రిదీ వ్యాఖ్యలకు శిఖర్ ధావన్

కశ్మీర్ మాదే.. ఎప్పటికీ మాతోనే ఉంటుంది: అఫ్రిదీ వ్యాఖ్యలకు శిఖర్ ధావన్

ఓపక్క ప్రపంచమంతా.. పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారిని ఎలా తరిమి కొట్టాలా అని రేయింబవళ్లు ఆలోచిస్తుంటే ఒక్క పాకిస్తాన్ మాత్రం అందుకు భిన్నంగా ప్రవర్తిస్తోంది. కశ్మీర్ మాదే అంటూ పాడిన పాటే పాడుతోంది. ఇదే విషయమై పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది పీవోకేలో స్పందిస్తూ.. భారత ప్రధాని నరేంద్ర మోదీపై, కశ్మీర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవడంతో.. ఇండియన్ క్రికెట్‌ టీమ్‌కి చిర్రెత్తుకొచ్చింది. ఓపెనర్ శిఖర్‌ధావన్ అయితే అఫ్రిదీ మీద ఒంటికాలిపై లేచాడు.

కరోనా వైరస్‌ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. కశ్మీర్ గురించి మాట్లాడుతారా.. అయినా కశ్మీర్ మాది.. మాతోనే ఉంటుంది. ఎప్పటికీ మాదే.. కావాలంటే 22 కోట్ల మందిని తీసుకురా.. మేం ఒక్కళ్లం.. లక్షల మందితో సమానం. అని అఫ్రిదీకి ఘాటుగా బదులిచ్చాడు ధావన్. అంతకు ముందే గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్ అఫ్రిదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గంభీర్ సైతం.. అఫ్రిదీ 16 ఏళ్ల వృద్ధుడు, పాక్‌లోని 7 లక్షల సైన్యానికి 20 కోట్ల ప్రజల మద్దతు ఉందని అన్నాడు. అయినా వాళ్లు 70 ఏళ్లుగా కశ్మీర్ కోసం యాచిస్తున్నారు.

పాక్ ప్రజల్ని మోసం చేయడానికి ఇమ్రాన్ ఖాన్, బజ్వా, అఫ్రిదీ లాంటి జోకర్లు భారత్‌పై, ప్రధాని మోదీపై విషం చిమ్ముతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసి మీ గౌరవాన్ని దిగజార్చుకోకండి.. మీరెప్పటికీ కశ్మీర్‌ను పొందలేరు అని ట్వీట్ చేశాడు. హర్భజన్ మాట్లాడుతూ.. కరోనా విపత్తు వేళ అఫ్రీదీ కోరితే తానూ, యూవీ స్పందించామని అయినా ఇలాంటి వ్యాఖ్యలు చేసి తన మనస్థత్వాన్ని చాటుకున్నాడని అన్నారు. అతడిని మంచి మిత్రుడిగా భావించినందుకు సిగ్గుపడుతున్నామని భజ్జీ తెలిపాడు. అఫ్రిదీ ఆ అర్హత కోల్పోయాడని అన్నాడు.

Tags

Read MoreRead Less
Next Story