శ్రీనగర్‌లో మరో ఇద్దరు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్‌లో మరో ఇద్దరు ఉగ్రవాదులు హతం
X

భారత సైన్యం శ్రీనగర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. నవకదల్ ప్రాంతంలో ఇద్దరు ఉగ్రవాదులు తలదాచుకున్నారన్న సమాచారాన్ని తెలుసుకున్న ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు కలిసి ఈ ఆపరేషన్ పూర్తి చేశారు. సోమవారం రాత్రి ప్రారంభమైన ఈ ఎన్ కౌంటర్ 10 గంటలపాటు భీకరంగా కొనసాగింది. ఇందులో హతమైన ఉగ్రవాదులు ఏ ఉగ్రవాద సంస్థకు చెందిన వారో ఇంకా తెలియలేదు. ఆర్టికల్ 370 రద్దు తరువాత ఉగ్రవాదుల చొరబాట్లు బాగా పెరిగాయి. దీంతో.. అప్పటి నుంచి సైన్యం, జమ్మూ కశ్మీర్ పోలీసులు కలిసి 80మంది ఉగ్రవాదులను హతమార్చారు.

Next Story

RELATED STORIES