42 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్‌

42 ఏళ్ల వయసులో బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్‌
X

టాలీవుడ్‌లో సింధూరం మూవీతో మంచి గుర్తింపు పొందిన నటి సంఘవి. 1993లో అమరావతి మూవీ ద్వారా తమిళ చిత్ర పరిశ్రమకు హీరోయిన్‌గా పరిచయం అయింది సంఘవి. ఆ తరువాత తమిళం, తెలుగు, కన్నడ అంటూ దక్షిణాది లో పలు చిత్రాల్లో నటించింది. తెలుగులో దాదాపు 45కు పైగా సినిమాలు చేసింది. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణతో పాటు ఇతర హీరోలతో నటించింది. స్టార్ హీరోల సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ..39 ఏళ్ల వయస్సులో.. 2016లో వెంకటేశ్‌ అనే సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీర్‌ను పెళ్లి చేసుకుంది.

ఆ తరువాత కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్న సంఘవి ఇటీవల కాలంలో నటిగా రీఎంట్రీ అయింది. కాగా 42 ఏళ్ల వయస్సులో నటి సంఘవి అమ్మ అయింది. పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. సంఘవి ఒడిలో అమాయకపు చూపులు చూస్తున్న చిన్నారితో దిగిన ఫొటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

Next Story

RELATED STORIES