పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో తెనాలిలో భారీ కుంభకోణం! : మాజీ మంత్రి ఆలపాటి

X
TV5 Telugu18 May 2020 8:44 PM GMT
పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో తెనాలిలో 150 కోట్ల భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించారు.. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్. ముగ్గురు వ్యక్తులు ఎకరా 27.5 లక్షలకు కొని.. 72 లక్షలకు ప్రభుత్వానికి అమ్మారని... ఇదంతా పాలకుల కనుసన్నల్లోనే జరిగిందని ఆయన విమర్శించారు. పొలాలు కొని, అమ్మిన వారి ఆర్థిక స్తోమతపై విచారణ జరిపితే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. ఇప్పటికే తాను సమాచార హక్కు చట్టం కింద తహసీల్దార్, సబ్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్‌కు దరఖాస్తు చేసినట్లు తెలిపారు. తెనాలిలో ఇంత భారీ కుంభకోణం ఇప్పటి వరకు జరగలేదన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్.. దీనిపై విచారణ జరపకుంటే తానే స్వయంగా కోర్టుకు వెళ్తానన్నారు.
Next Story