దళిత మహిళపై కక్షగట్టి ఇప్పుడామె జీవనోపాధిపై దెబ్బకొట్టారు : చంద్రబాబు

ఎన్నికల పేరుతో వైసీపీ నాయకులు చేస్తున్న అక్రమాలను టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి ఎండగట్టారు. ట్విట్టర్ వేదికగా అధికారపక్ష నాయకుల అరాచకాలను ప్రస్తావించారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాడ గ్రామానికి చెందిన సాంబత్తుల భాగ్యలక్ష్మి అనే దళిత మహిళ.... టీడీపీ తరఫున ఎంపీటీసీగా నామినేషన్ వేయడానికి వెళ్తుంటే వైసీపీ నేతలు అడ్డుకుని బెదిరించారని.. అంతటితో ఆగకుండా ఆమెపై కక్షగట్టి ఇప్పుడామె జీవనోపాధిపై దెబ్బకొట్టారని మండిపడ్డారు. దళితులను ప్రభుత్వం ఎందుకిలా అణచివేస్తోందని చంద్రబాబు ప్రశ్నించారు.
ఉపాధి హామీ సభ్యురాలిగా ఉన్న భాగ్యలక్ష్మిని పనిలోకి రావద్దని చెప్పడమేంటని చంద్రబాబు నిలదీశారు. ఇదేమని అడిగితే కులం పేరుతో దూషిస్తారా అంటూ ప్రశ్నించారు. భాగ్యలక్ష్మిని వెంటనే పనుల్లోకి తీసుకుని... ఆమెను ఇబ్బంది పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com