తీరంవైపు దూసుకొస్తున్న అంఫన్ తుఫాన్.. గంటకు 185 కి.మీ. వేగంతో ఈదురు గాలులు

తీరంవైపు దూసుకొస్తున్న అంఫన్ తుఫాన్.. గంటకు 185 కి.మీ. వేగంతో ఈదురు గాలులు

ఒడిశా, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలకు ప్రచండ తుఫాన్‌ ముప్పు పొంచి వుంది. అతి తీవ్ర తుఫానుగా మారిన అంఫన్‌.. ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. ప్రస్తుతం పారాదీప్‌కు దక్షిణంగా 730 కిలోమీటర్ల దూరంలో.. దిఘాకు దక్షిణ నైరుతి దిశగా 890 కిలోమీటర్ల దూరంలో.. బంగ్లాదేశ్‌లోని ఖేపుపరకు దక్షిణ నైఋతి దిశగా 1010 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నది. సముద్రంలో గంటలకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.

అంఫన్‌ తుఫాన్ ఉత్తర ఈశాన్య దిశగా వాయువ్య బంగాళాఖాతం మీదుగా ప్రయాణించి.. పశ్చిమ బెంగాల్ - బంగాదేశ్ తీరాల వద్ద.. దిఘా మరియు హతియా దీవులు మధ్య తీరం దాటే అవకాశం వుంది. మే 20న మధ్యాహ్నం సమయంలో అతి తీవ్ర తుఫాన్‌గా మారి తీరం దాటే అవకాశం వుందని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్ తీరం దాటే సమయంలో గంటకు 165 నుంచి 175 కిలోమీటర్ల నుంచి 185 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.

ప్రస్తుతం అంఫన్ తుఫాన్ 8 కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. ఈ తుఫాన్ ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌తోపాటు ఉత్తర కోస్తా జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం వున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాలోనూ పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం వున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలున్నాయి. ఓడరేవుల్లో ఇప్పటికే రెండో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. అటు మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లా కోనసీమ తీరప్రాంతంలో సముద్రం అల్ల కల్లోలంగా మారింది. అంఫన్ తుఫాన్ ప్రభావంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రాజోలు నియోజకవర్గం లోని తూర్పు పాలెం, కేసనపల్లి, అంతర్వేదిలో సముద్రం 15 మీటర్లు ముందుకు వచ్చింది. నియోజకవర్గంలోని సముద్ర తీర ప్రాంతాలు లో ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. తీరప్రాంత వాసులను, మత్య కారులను పోలీసులు అప్రమత్తం చేశారు.

బంగాళాఖాతంలో తుఫాన్ ప్రభావంతో కాకినాడ ఉప్పాడ సముద్ర తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. అటు తుఫాన్ కారణంగా సఖినేటి పల్లి మండలం అంతర్వేది నుండి మామిడి కుదురు మండలం కరవాక వరకు వున్న సముద్రం 10 మీటర్లు ముందుకొచ్చింది. కాకినాడ పోర్టులో ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story