ఆగస్టు నుంచి బడికి వెళ్లాలి..

ఆగస్టు నుంచి బడికి వెళ్లాలి..

ఆంధ్రప్రదేశ్‌లో ఆగస్ట్ 3 నుంచి స్కూళ్లు ప్రారంభిస్తున్నట్లు సీఎం జగన్ ప్రకటించారు. కరోనా వల్ల పరీక్షలు, చదువులు అన్నీ అటకెక్కాయని తల్లిదండ్రులు తల పట్టుకుంటున్నారు. రెండు నెలల నుంచి ఇంట్లో ఉంటున్న పిల్లలు మరో రెండు నెలలు కూడా ఉండక తప్పని పరిస్థితి. కరోనా వ్యాప్తి తీవ్రతరం కాకూడదని ప్రభుత్వాలు ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇప్పటికే ఏపీ పదవతరగతి పరీక్షల షెడ్యూల్ ప్రకటించింది. ఇప్పుడు స్కూల్స్ ఎప్పుడు తెరుచుకునేదీ ప్రకటించారు.

జులై నెలాఖరులోగా మొదటి విడతలో చేపట్టిన వివిధ పాఠశాలలకు సంబంధించి అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. విద్యార్ధులకు 9రకాల సదుపాయాలు కల్పించాల్సి ఉందన్నారు. ఇందుకు సంబంధించిన పనులు పూర్తి చేసేందుకు కావాల్సిన నిధులు రూ.456 కోట్ల రివాల్వింగ్ ఫండ్‌ని విడుదల చేశామని అన్నారు. పనులు జరిగే తీరును సమీక్షించేందుకు కలెక్టర్లు ప్రతి రోజూ రివ్యూ చేయాలని జగన్ సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story