ఉద్యోగం పోతోంది.. స్విగ్గీలో 1100 మందిని..

ఉద్యోగం పోతోంది.. స్విగ్గీలో 1100 మందిని..

సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్.. అనే రోజులు మళ్లీ వచ్చాయేమో. పెద్ద పెద్ద కంపెనీల్లో జాబు సంపాదించలేకపోయినా.. అమ్మనాన్నలని ఇబ్బంది పెట్టకూడదని నాలుగు రాళ్లు సంపాదించుకుంటున్నారు. స్విగ్గీ డెలివరీ బాయ్‌గా సేవలందిస్తూ వాళ్ల కాళ్ల మీద వాళ్లు బతుకుతున్నారు. కరోనా పుణ్యమా అని లాక్డౌన్ కాలంలో దాదాపు రెండు నెలల నుంచి రెస్టారెంట్లు మూత పడ్డాయి. ఒక వేళ లాక్డౌన్ తెరిచినా ఇదివరకటిలా కస్టమర్లు ఫుడ్ ఆర్డర్ చేస్తారో లేదో తెలియని పరిస్థితి. ఇట్లాంటి సమయంలో జీతాలు ఇవ్వలేమంటూ చేతులెత్తేస్తున్నాయి సంస్థలు.

ఇంతకు ముందు దాదాపు 900 మంది స్విగ్గీ సిబ్బందిని తొలగించింది. తాజాగా మళ్లీ 1100 మందిని తొలగించి ఉద్యోగులకు షాకిచ్చింది. దీనికి సంబంధించి స్విగ్గీ సీఈవో శ్రీహర్ష మాజేటి ఉద్యోగులకు ఓ ఈమెయిల్‌ను పంపించారు. పుడ్ డెలివరీ వ్యాపారంపై కరోనా తీవ్ర ప్రభావాన్ని చూపిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆయన అన్నారు. అంతేకాకుండా స్విగ్గీ చరిత్రలో ఇదో బాధాకరమైన రోజని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగాల నుంచి తొలగించబడిన ప్రతి ఒక్కరికి కనీసం మూడు నెలల జీతాన్ని ఇవ్వనున్నట్లు శ్రీహర్ష వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story