హృదయ విదారక ఘటన.. ఆకలి తీర్చలేక తన ముగ్గురు పిల్లల్ని చంపిన తండ్రి

హృదయ విదారక ఘటన.. ఆకలి తీర్చలేక తన ముగ్గురు పిల్లల్ని చంపిన తండ్రి
X

తమిళనాడులో దారుణం జరిగింది. పేదల పాలిట లాక్‌డౌన్‌ శాపంగా మారుతోంది. రెక్కాడితే కాని డొక్కాడని కుటుంబాలు.. పనిలేక, చేతుల్లో డబ్బులు లేక ప్రాణాలు తీసుకుంటున్నాయి. తాజాగా కాంచీపురంలో పెరంబదూర్‌లో ఇలాంటి దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉపాధి లేక తన ముగ్గురు పిల్లల్ని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నాడు ఓ కూలీ.

పెరంబదూర్‌కు చెందిన ఆర్ముగం.. స్థానికంగా కూలీ పని చేసుకుని జీవించేవాడు. గత రెండు నెలలు నుంచి పనులు లేకపోవడంతో అప్పులు చేశాడు. చేసిన అప్పులు తీర్చలేక, పిల్లల అవసరాలను తీర్చలేక, చేతిలో డబ్బులు లేక మానసికంగా కుంగిపోయాడు. దీంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. పిల్లలతో కలిసి బయటికి వెళ్లొస్తానని చెప్పి ఊరి చివరన ఉన్న బావి దగ్గరకు వెళ్లాడు. ముగ్గురు పిల్లలను ఒకే తాడుకు కట్టి.. వారి కాళ్లకు బండరాయిని తాళ్లతో చుట్టి బావిలో పడేశాడు. ఆ తర్వాత తానూ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తమిళనాడులో సంచలనం సృష్టిస్తోంది.

Next Story

RELATED STORIES