అంపన్ ప్రభావం.. తీర ప్రాంతం అల్లకల్లోలం..

అంపన్ ప్రభావం.. తీర ప్రాంతం అల్లకల్లోలం..

బంగాళాఖాతాలో ఏర్పడిన పెను తుఫాను అంపన్ తీవ్రతకు తూర్పుగోదావరి జిల్లాలోని ఉప్పాడ తీరం అల్లకల్లోలంగా మారింది. ఒడిశాలోని పారాదీప్‌కు దక్షిణంగా 123 కిలోమీటర్ల దూరంలో అంపన్ కేంద్రీకృతమైంది. ఈరోజు మధ్యాహ్నం తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

తుఫాను ప్రభావంతో గంటకు 150 నుంచి 190 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే 3 లక్షల మందిని పునరావాస శిబిరాలకు తరలించారు. సహాయక చర్యల నిమిత్తం 19 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరింపజేశారు.

తుఫాను ప్రభావం తీర ప్రాంత వాసులను ఆందోళనకు గురి చేస్తోంది. చెట్టు కూలడం, ఇళ్లు కూలడంతో తుఫాను తీవ్రత భారీగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మత్స్యకారులను సముద్రంలో వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. కళింగపట్నం, భీముని పట్నం, విశాఖపట్నం, గంగవరం, మచిలీపట్నం, నిజాంపట్నం, వాడరేవు, కష్ణపట్నంలో మూడో నెంబరు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. అంపన్ ప్రభావం శ్రీకాకుళం జిల్లా తీర ప్రాంత వాసులపై కూడా పడింది. ఇక్కడి మండలాల్లో గాలుల ఉద్ధృతి ఎక్కువగా ఉంది.

Tags

Read MoreRead Less
Next Story