ఈ ఏడాది కోటిన్నర మొక్కలు నాటాలని లక్ష్యం : మంత్రి హరీష్ రావు

ఈ ఏడాది కోటిన్నర మొక్కలు నాటాలని లక్ష్యం : మంత్రి హరీష్ రావు

ఈ యేటా కోటిన్నర మొక్కలు నాటేలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు మంత్రి హరీష్ రావు వెల్లడించారు. సిద్ధిపేట జిల్లాకు సంబంధించి హరిత హారం యాక్షన్ ప్లాన్ పై ఆయన అధికారులతో సమీక్షించారు. జూన్ రెండో వారంలో మొక్కులు నాటే కార్యక్రమం ప్రారంభించాలని సూచించారు. రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తున్న సిద్ధిపేట జిల్లా..ఈ ఏడాది కూడా ముందంజలో ఉండేలా కృషి చేయాలన్నారు. గ్రామాల వారీగా రహదారులకు ఇరువైపుల మొక్కులు నాటాలన్నారు. అలాగే కాలువ గట్ల వెంబడి నాలుగు వరుసల చొప్పున సీతాఫలం, వేప చెట్లను నాటాలని అధికారులకు మంత్రి సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story