ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు.. మీకు తెలియని ఎన్నో విషయాలు..

ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు.. మీకు తెలియని ఎన్నో విషయాలు..
X

తాత పేరు పెట్టుకున్నాడు.. తాత అంతటి వాడవ్వాలని కలలు కన్నాడు. తాత నుంచి నటవారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న నందమూరి తారక రామారావు పదో ఏటనే ఇండస్ట్రీలో అడుగు పెట్టి తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. నటనలో, డ్యాన్సులో, డైలాగ్ డెలివరీలో తాతకు తగ్గ మనవడిగా పేరు సంపాదించుకున్నాడు. బుధవారం జూ.ఎన్టీఆర్ పుట్టిన రోజు. అభిమానుల విషెస్‌తో సోషల్ మీడియా హోరెత్తుతోంది. ఈ సందర్భంగా ఆయన గురించిన కొన్ని ఆసక్తికర సంగతులు..

తాత నటిస్తున్న బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో జూ.ఎన్టీఆర్ నటించాడు. అప్పుడు అతడి వయసు పదేళ్లు.

గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన రామాయణంలో రాముడి పాత్ర వేసి ప్రశంసలందుకున్నాడు. అతడు చేసే చిలిపి అల్లరిని భరిస్తూ సినిమాను సక్సెస్‌ ఫుల్‌గా పూర్తి చేశారు దర్శకుడు అండ్ టీమ్. సీతా పరిణయం సమయంలో విరచాల్సిన శివధనస్సును ముందుగానే విరఛడం, సీత పాత్ర వేసిన అమ్మాయికి లవ్ లెటర్ లక్ష్మణ పాత్ర ధారిచేత రాయించడం ఇవన్నీ మరిచిపోలేని తీపిగురుతులు.

ఇక పెద్దయ్యాక హీరోగా నటించిన తొలి సినిమా నిన్ను చూడాలని. దానికి తీసుకున్న రెమ్యునరేషన్ రూ.3.5 లక్షలు.. నేరుగా తీసుకెళ్లి అమ్మకి ఇచ్చారు.

ఎన్టీఆర్ నటించిన బాద్‌షా.. జపనీస్‌లో డబ్ అయి అక్కడి ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడింది. రజనీకాంత్ తర్వాత ఆ స్థాయిలో జపాన్‌లో గుర్తింపు పొందిన నటుడు తారక్.

తను పనిచేసే సినిమాల దర్శకులను అప్యాయంగా పిలుచుకుంటారు ఎన్టీఆర్. వివి వినాయక్‌ను వినయ్ అన్నా అని, రాజమౌళిని జక్కన్న అని, సురేందర్ రెడ్డిని సూరి అని, వంశీని కటకటాల రుద్రయ్య అని ప్రేమగా పిలుస్తారు.

నాగార్జున నటించిన 'ఊపిరి' చిత్రంలో నటించిన కార్తీ స్థానంలో ఎన్టీఆర్ నటించాల్సి ఉంది. కానీ నాన్నకు ప్రేమతో సినిమా చేస్తుండడం వల్ల డేట్స్ అడ్జెస్ట్ చేయలేకపోయారు.

ఆరు సినిమాల్లో తన గొంతు సవరించారు. యమదొంగ, కంత్రి, అదుర్స్, రభస, నాన్నకు ప్రేమతో, కన్నడ చిత్రం చక్ర వ్యూహ చిత్రాల్లో పాటలు పాడారు.

ఎన్టీఆర్ సినిమా అంటేనే అదిరిపోయే డైలాగులు, పంచ్‌లు. కానీ ఇంటర్వెల్ వరకు ఎన్టీఆర్ మాట్లాడని సినిమా నరసింహుడు.

రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నెం.1, సింహాద్రి, యమదొంగ చేశారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ చేస్తున్నారు.

ఎన్టీఆర్‌ లక్కీ నెంబర్ 9.. అందుకే ఆయన వెహికల్స్ అన్నిటికీ 9 నెంబర్ ఉంటుంది. ఇక ట్విట్టర్ ఖాతా కూడా తారక్ 9999 అని ఉంటుంది.

తన తాత నటించిన దానవీరశూరకర్ణ సినిమా అంటే ఎన్టీఆర్‌కు చాలా ఇష్టం. ఇక ఇష్టమైన పాట అంటే మాతృదేవోభవ చిత్రంలోని 'రాలిపోయే పువ్వానీకు రాగాలెందుకే'.

రేపేంజరుగుతుంది అనేదాని గురించి అస్సలు ఆలోచించకూడదంటారు. నాకంతా తెలుసు అనే ఆలోచనను పక్కన పెట్టేయాలంటారు. నాకేమీ తెలియదు అని అనుకోవాలంటారు. ఈ క్షణమే నాది దాన్ని ఆనందంగా గడిపేయాలని చెబుతుంటారు.

ఇక ఫ్యాన్స్ గొడవపడడం ఎన్టీఆర్‌కి నచ్చని విషయం. ముందు దేశాన్ని, తరువాత తల్లిదండ్రులను, ఆపై భార్యాబిడ్డలను, చివరిగా సినిమా నటులను అభిమానించాలని చెబుతారు.

Next Story

RELATED STORIES