స్కూల్ తెరిచిన మొదటి రోజే ఇద్దరు విద్యార్ధులకి కరోనా..

స్కూల్ తెరిచిన మొదటి రోజే ఇద్దరు విద్యార్ధులకి కరోనా..

కరోనా నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటూ కొన్ని ఆంక్షల నడుమ పాఠశాలలు తెరిచింది దక్షిణ కొరియా ప్రభుత్వం. ఆదిలోనే అడ్డంకులు.. బడి తెరిచిన మొదటి రోజే ఇద్దరు విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆ ఇద్దరిని వెంటనే ఇంటికి పంపించి వేశారు. గడిచిన 24 గంటల్లో 32 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. పాఠశాలలు తెరిచినా విద్యార్థులకు థర్మల్ స్క్రీనింగ్ చేసిన తరువాతే క్లాసులోకి అనుమతిస్తున్నారు. శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవడంతో పాటు, విద్యార్థులు, ఉపాధ్యాయులు మాస్కులు కచ్చితంగా ధరించేటట్లు చూస్తున్నారు. వచ్చే నెల 8 నుంచి ప్రాధమిక స్థాయి విద్యార్ధులకు కూడా క్లాసులు ప్రారంభిస్తామని తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story