మెడికల్ ఫీజులపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు

మెడికల్ ఫీజులపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు

తెలంగాణలో పీజీ మెడికల్, దంత వైద్య ఫీజుల పెంపుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. A-కేటగిరీ విద్యార్థులు ఫీజులో 50 శాతం, B-కేటగిరీ విద్యార్థులు ఫీజులో 60 శాతం చెల్లించాలని సూచించింది. కరోనా సంక్షోభ సమయంలో ఫీజుల పెంపు విద్యార్థులకు భారమేనన్న హైకోర్టు.. మిగతా ఫీజుకు విద్యార్థులు బాండు రాసివ్వాలని చెప్పింది. NRI కోటా విద్యార్థులు పూర్తి ఫీజు చెల్లించాలని ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే.. ఫీజు చెల్లింపులు తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. ఈ అంశంపై 4 వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని TAFRC, వైద్య కళాశాలల్ని ఆదేశించింది.

Tags

Read MoreRead Less
Next Story