పది, ఇంటర్ పరీక్షలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

పది, ఇంటర్ పరీక్షలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
X

పది, ఇంటర్ పరీక్షల విషయంలో కేంద్ర కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పటికీ.. పది, ఇంటర్ పరీక్షల నిర్వహించుకునేందుకు అనుమతినిచ్చింది. ఈమేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్రాల సీఎస్ లకు లేఖలు రాశారు. విద్యార్థులు ప్రిపరేషన్ దృష్టిలో పెట్టుకొని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్టు అజయ్ భల్లా తెలిపారు. అయితే, సమాజిక దూరం పాటించాలని.. విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సుల ఏర్పాటు చేయాలని.. వైరస్ వ్యాప్తికి ఏమాత్రం ఆస్కారం లేకుండా పరిక్షలు నిర్వహించాలని ఆయన తెలిపారు. కంటోన్మెంట్ జోన్లలో పరిక్షా కేంద్రాలు ఏర్పాటు చేయొద్దని స్పష్టం చేశారు. విద్యార్థులు, టీచర్లు, సిబ్బంది అందరూ ఫేస్ మాస్కులు ధరించేలా.. జాగ్రత్తలు పాటించాలని చూచించారు.

EYc-sTVUYAEfmgv

Next Story

RELATED STORIES