తాజా వార్తలు

ఆగస్టు నాటికి 50 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు.. : కేటీఆర్

ఆగస్టు నాటికి 50 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు.. : కేటీఆర్
X

ఈ ఏడాది ఆగస్టు నాటికి హైదరాబాద్‌లో 50 వేల మంది పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అందిస్తామని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన GHMC పరిధిలో చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ కార్యక్రమం పై సమీక్ష నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మక కార్యక్రమంగా చేపట్టిందని, ఈ మేరకు హైదరాబాద్ నగరంలోనే సుమారు లక్ష ఇళ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసి పనులు ప్రారంభించామన్నారు కేటీఆర్‌.

హైదరాబాద్ నగరంలో చేపట్టిన సుమారు లక్ష ఇళ్ల నిర్మాణ పురోగతిని మంత్రులు సమీక్షించారు. ప్రస్తుతం లాక్ డౌన్ ఉన్నప్పటికీ నిర్మాణ పనులు నిరంతరం కొనసాగుతున్నట్లు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ వర్కింగ్ ఏజెన్సీలు మంత్రుల దృష్టికి తీసుకు వచ్చాయి. అయితే ప్రస్తుతం స్టీలు, సిమెంటు, ఇసుక వంటి అంశాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని మంత్రుల దృష్టికి వర్కింగ్ ఏజెన్సీలు తీసుకువచ్చాయి. స్టీలు, ఇసుక, సిమెంట్ వంటి అంశాలు ప్రభుత్వం వర్కింగ్ ఏజెన్సీలకు సహాయకారిగా ఉంటుందని ఈ మేరకు ఆయా కంపెనీలతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయాలని పురపాలక శాఖ, గృహ నిర్మాణ శాఖ అధికారులను మంత్రులు ఆదేశించారు.

ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల 80 శాతానికిపైగా నిర్మాణాలు పూర్తయ్యాయని మిగిలిన సైట్లలో నిర్మాణాలను పూర్తి చేసేందుకు ఇతర డిపార్ట్మెంట్ లతో సమన్వయం చేసుకుని ముందుకు పోవాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు. నిర్మాణాలు పూర్తి అయిన చోట వెంటనే విద్యుత్ మరియు తాగునీరు వంటి ఎక్సటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాట్లను త్వరిత గతిన పూర్తి చేయాలని సూచించారు. ఇప్పటికే ఇళ్ల నిర్మాణం పూర్తయిన సైట్లను వెంటనే జిహెచ్ఎంసి హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. సాధ్యమైనంత త్వరగా మిగిలిన ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలిపారు.

Next Story

RELATED STORIES