కూతుర్ని బావిలోకి తోసేసి.. ఆత్మహత్య చేసుకున్న భార్యాభర్తలు

కూతుర్ని బావిలోకి తోసేసి.. ఆత్మహత్య చేసుకున్న భార్యాభర్తలు
X

మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం మన్నెగూడెంలో విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో కూతుర్ని బావిలోకి తోసి.. భార్యభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు.. మెన్నెగూడం గ్రామానికి చెందిన 28 ఏళ్ల రాంబాబు, 25 ఏళ్ల కృష్ణవేణిలకు ఆరేళ్ల కిందట వివాహం జరిగింది. ఇటీవల కుటుంబ కలహాలతో ఇద్దరు తీవ్రంగా మనస్థాపం చెందారు.. దీంతో అల్లారు ముద్దుగా చూసుకుంటున్న 9 నెలల చైత్రికను బావిలో పడేసి.. తరువాత దంపతులిద్దరూ.. వారు సాగుచేస్తున్న వ్యవసాయ భూమి దగ్గర ఆత్మహత్యకు పాల్పడ్డారు.. ముగ్గురి మృతితో ఆ గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి.. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

RELATED STORIES