అమెరికాలో అమ్మకాలు నిలిపివేత: జాన్సన్ కంపెనీ ప్రకటన

X
అమెరికా, కెనడా దేశాలలో తమ బేబీ పౌడర్ అమ్మకాలను నిలిపి వేస్తున్నామని జాన్సన్ కంపెనీ ప్రకటించింది. ఈ ఉత్పత్తులు వాడుతుంటే తమకు క్యాన్సర్ వచ్చిందనే ఆరోపణలు ఎదుర్కుంటోంది సంస్థ. కొన్ని సంవత్సరాల పాటు కోర్టులో కేసులు కూడా నడిచాయి. వాటన్నింటికీ కంపెనీ కోట్ల డాలర్ల నష్టపరిహారాన్ని చెల్లించాల్సి వస్తోంది. అయినప్పటికీ తమ కంపెనీ ఉత్పత్తులు సరైనవే అని సమర్ధించుకుంటోంది. సంస్థ టాల్క్ం పౌడర్లో ఆస్బెస్టాస్ ఆనవాళ్లు ఉన్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ ఆరోపణలతో 16,000 కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ నేపథ్యంలో తమ ఉత్పత్తుల అమ్మకాలను అమెరికాలో నిలిపి వేస్తున్నట్లు సంస్థ వివరించింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
