కరోనా ఎఫెక్ట్.. 86 నుంచి 63కి

కరోనా వైరస్.. వాళ్లూ వీళ్లు అని చూడదు.. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల్నీ అటాక్ చేస్తుంది. కాలిఫోర్నియాకు చెందిన మైక్ షుల్టజ్ గత మార్చిలో వైరస్ బారిన పడ్డాడు. చికిత్స తీసుకున్న అనంతరం కోలుకోవడానికి 6 వారాలు పట్టింది. కరోనా ఎఫెక్ట్‌తో 23 కిలోల బరువు తగ్గినట్లు మైక్ వెల్లడించాడు. కరోనా రాక ముందు వరకు రోజూ జిమ్‌లో వర్కవుట్లు చేసేవాడినని అన్నాడు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేనప్పటికి వైరస్ సోకింది. వైరస్ తీవ్రత అధికంగా ఉన్న మయామి బీచ్‌లో జరిగిన పార్టీకి హాజరయ్యాడు. దాంతో అతడికి కరోనా సోకింది.
చికిత్సలో భాగంగా 6 వారాల పాటు వెంటిలేటర్‌పై ఉంచారు. స్వయంగా శ్వాస తీసుకోవడానికి 4 వారాల సమయం పట్టింది. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉంది. అయితే కరోనా ఎలాంటి వారిపైన అయనా ప్రభావాన్ని చూపిస్తుందని, దానికి వయసుతో సంబంధం లేదని పేర్కొన్నాడు. వైరస్ బారిన పడకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నాడు. మీరు ఆరోగ్యవంతులైనప్పటికీ ఈ మహమ్మారి మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది. అందుకే అందరూ కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని మైక్ హెచ్చరించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com