ఇకపై ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కరోనా టెస్ట్..

ఇకపై ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కరోనా టెస్ట్..
X

భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) అనుమతించిన ప్రైవేటు లేబరేటరీల్లో కోవిడ్ టెస్ట్ చేయించుకోవడానికి హైకోర్ట్ డివిజన్ బెంచ్ అనుమతించింది. ప్రభుత్వాసుపత్రుల్లోనే చేయించుకోవాలని బలవంతం చేయరాదని స్పష్టం చేసింది. టెస్ట్‌కు అవసమయ్యే ఖర్చును భరించగలిగే స్థోమత ఉన్నవారు అనుమతి పొందిన ల్యాబ్‌లు, ఆస్పత్రుల సేవలు ఉపయోగించుకోవచ్చని తెలిపింది.

ప్రభుత్వాసుపత్రుల్లోనే కరోనా నిర్దారణ పరీక్షలు, చికిత్సలు పొందాలంటూ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసింది. గంటా జైకుమార్ అనే వ్యక్తి ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సకు అనుమతులు కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎం.ఎస్, రామచంద్రరావు, జస్టిస్ కె. లక్ష్మణ్‌లతో కూడిన ధర్మాసనం బుధువారం ఆదేశాలు జారీ చేసింది.

అయితే ప్రైవేట్ ఆసుపత్రులు ఐసీఎంఆర్ అనుమతులు పొందిన తరువాతే పరీక్షలు చేయాలని తీర్పు చెప్పింది. రోజువారి కోవిడ్ గణాంకాలను ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉందని తెలిపింది. ఇప్పటి వరకు కోవిడ్ టెస్ట్‌లు ప్రభుత్వ ల్యాబుల్లోనే జరగడం చేత టెస్టింగులు తక్కువగా జరిగాయని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రీతిసూదన్ పేర్కొన్నారు. టెస్టింగులు వేగవంతం చేయాలని తెలంగాణ రాష్ట్రానికి సూచించారు.

Next Story

RELATED STORIES