రాష్ట్రంలో మోదీ పర్యటించాలి.. భారీ నష్టం జరిగింది: మమత

రాష్ట్రంలో మోదీ పర్యటించాలి.. భారీ నష్టం జరిగింది: మమత
X

ఆంఫన్ తుపాను రాష్ట్రంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చిందని పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ చెప్పారు. ఆంఫన్ తాకిడికి రాష్ట్రంలో 72 మంది మరణించారని.. ఇంతటి విధ్వాంసాన్ని తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. మృతుల కుటుంబాలకు 2.5 లక్షల ఆర్థిక సాయం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా రాష్ట్రంలోని పర్యటించి తుపాన్ చేసిన నష్టాన్నితెలుసుకోవాలని కోరారు. బంగ్లాదేశ్ లోని హతియా దీవులు, పశ్చిమ బెంగాల్ లోని డిఘా దీవులు మధ్య ఉన్న సుందర్ బన్స్ దగ్గరల్లో ఈ తుపాను తీరం దాటింది. సుమారు 170 కిలోమీటర్ల వేగంగా వీచిన ఈ ఆంఫన్ తుపాన్.. పశ్చిమ బెంగాల్ కు తీవ్ర నష్టం మిగిల్చింది. అటు, దీని కారణంగా ఒడిశాలో కూడా ఇద్దరు మరణించారు.

Next Story

RELATED STORIES