ఒడిశా, బెంగాల్ రాష్ట్రాలను ఆదుకుంటాం: మోదీ

ఒడిశా, బెంగాల్ రాష్ట్రాలను ఆదుకుంటాం: మోదీ

ఆంఫన్ తుపానుతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీవ్రంగా నష్టపోయాయి. ఆస్తి నష్టం మాత్రమే కాదు.. ప్రాణ నష్టం కూడా సంభవించింది. ఈ విధ్వంసంపై ప్రధాని మోదీ స్పందించారు. తుపానుతో అతలాకుతలమైన బెంగాల్, ఒడిశా రాష్ట్రాలను ఆదుకుంటామని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. బెంగాల్, ఒడిశాలో ఆంఫన్ తుపాను బీభత్స దృశ్యాలు చూశానని తెలిపారు. సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, అధికారులు తీవ్రంగా యత్నిస్తున్నారని చెప్పారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. అటు, ఇదే విషయంపై హోం మంత్రి అమిత్ షా కూడా ట్వీట్ చేశారు. రెండు రాష్ట్రాల సీఎంలతో మాట్లాడుతానని.. ఇరు రాష్ట్రాలకు ఆదుకుంటామన్నారు.

కాగా, ఆంఫన్ కారణంగా బెంగాల్ లో 72 మంది, ఒడిశాలో ఇద్దరూ మృతి చెందారు. ప్రధాని మోదీ రాష్ట్రంలో పర్యటించాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కోరారు.

Tags

Read MoreRead Less
Next Story