నేపాల్‌కు సపోర్ట్ చేసి వివాదాల్లో చిక్కుకున్న నటి మనీషా కోయిరాలా

నేపాల్‌కు సపోర్ట్ చేసి వివాదాల్లో చిక్కుకున్న నటి మనీషా కోయిరాలా
X

సొంత దేశానికి మద్దతు పలికి బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా వివాదంలో చిక్కుకుంది. నటి ప్రకటనపై నెటిజన్లు ఆగ్రహించారు. మీ దేశానికి వెళ్లిపోండంటూ డైరెక్ట్‌గానే కామెంట్లు పెడుతున్నారు. భారత్‌లోని సరిహద్దు ప్రాంతాలను తమవిగా చెప్పుకుంటూ మ్యాప్‌ను తయారు చేసింది నేపాల్. అందులో మన దేశంలోని లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురా ప్రాంతాలున్నాయి. వీటిని తమ దేశ అంతర్గత భూభాగాలంటూ నేపాల్ మంత్రి మండలి కొత్త మ్యాప్‌ను ఆమోదించింది. దీనిపై స్పందించిన నటి మనీషా కొయిరాలా.. తన దేశానికి సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేసింది. ఇదే ఆమె అభిమానులు, భారతీయుల ఆగ్రహానికి కారణమైంది.

నేపాల్ గౌరవం ఎప్పుడూ భారత్‌తోనే ముడిపడి ఉంటుందని నెటిజన్లు మనీషాకు కౌంటర్ ఇస్తున్నారు. మావోయిస్టులు అధికారంలోకి వచ్చాక చైనా చేతిలో కీలుబొమ్మగా మారారంటూ మండిపడుతున్నారు. వెళ్లి మీ దేశ సినీ పరిశ్రమలో సంపాదించుకోండి అంటూ ట్వీట్లు చేస్తున్నారు. మరోవైపు నేపాల్ వాదనను భారత్ కొట్టిపారేసింది. నేపాల్ మ్యాప్‌కు ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.

Next Story

RELATED STORIES