జాతీయం

కీలక వడ్డీరేట్లను తగ్గించిన ఆర్బీఐ

కీలక వడ్డీరేట్లను తగ్గించిన ఆర్బీఐ
X

రెపో రేటు 40 బేసిస్‌ పాయింట్లు తగ్గించినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటించారు. శుక్రవారం ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు. రెపో రేటు 4.40 నుంచి 4 శాతానికి తగ్గించినట్లు పేర్కొన్నారు. రివర్స్‌ రెపోరేటు 3.35శాతానికి కుదిస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఒడిదుడుకుల్లో ఉందని, ఆర్థికరంగ అభివృద్ధికి మరిన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో సిమెంట్‌, ఉక్కు పరిశ్రమలపై ప్రతికూల ప్రభావం పడిందన్నారు. లాక్‌డౌన్ కాలంలో సిమెంట్‌ ఉత్పత్తి 25శాతం తగ్గిందని, పెట్టుబడుల ప్రవాహంపై తీవ్ర ప్రభావం పడిందని శక్తికాంత్‌దాస్‌ వెల్లడించారు.

వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పెరగడంతో ఇది వ్యవసాయ రంగానికి మరింత ప్రోత్సాహకం ఉంటుందన్నారు ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌దాస్‌. . కూరగాయలు, నూనె గింజల ధరలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని తెలిపారు. ఈ ఏడాది రుతుపవనాలు సాధారణంగానే ఉంటాయన్నారు. డిమాండ్‌ ఆధారంగా ద్రవ్యోల్బణం భవిష్యత్తు. ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన సవాళ్లు పొంచి ఉన్నాయని తెలిపారు ఆర్‌బీఐ గవర్నర్‌.

Next Story

RELATED STORIES