రూటు మార్చిన స్విగ్గీ, జొమాటో.. మద్యం సప్లైకి సై

రూటు మార్చిన స్విగ్గీ, జొమాటో.. మద్యం సప్లైకి సై

మద్యమే మా ఆదాయం.. మీరు తాగాలి.. మా ఖజానా నిండాలి.. క్యూలో నిల్చుంటే కరోనా వస్తుంది.. ఏం చేయాలి చెప్మా అంటూ ఓ ఐడియా తెరమీదకు తీసుకు వచ్చింది జార్ఖండ్ ప్రభుత్వం. స్విగ్గీ, జొమాటోలతో ఒప్పందం కుదుర్చుకుని మా (మందు) బాబులకు మీరు సప్లై చేయండి అని అడిగింది. ఒప్పందం ఓకే అవడంతో రాజధాని రాంచీలో ఇప్పటికే హోమ్ డెలివరీ చేస్తోంది. ఈ సదుపాయాన్ని త్వరలోనే మిగతా నగరాలకూ విస్తరింపజేయనున్నారు. యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నాం కదా అని ఎవరు పడితే వాళ్లు ఆర్డర్ పెట్టడానికి లేదు బాబు.. మీకు మద్యం తాగే వయసు వచ్చిందా లేదా అని నిర్ధారించుకున్నాకే ఆర్డర్ తీసుకుంటుంది. ఆఫ్టర్ కరోనా ఇంకేమేం చూడాల్సి వస్తుందో.. ఏమేం మార్పులు చోటు చేసుకుంటాయో అని ఆందోళన చెందుతున్నారు జార్ఖండ్ వాసులు.

Tags

Read MoreRead Less
Next Story