శరీరంలో రోగనిరోధక శక్తి ఎలా ఉందో తెలుసుకోవాలంటే..

శరీరంలో రోగనిరోధక శక్తి ఎలా ఉందో తెలుసుకోవాలంటే..

మీ రోగ నిరోధక శక్తి ఎలా ఉందో ఓ సారి చెక్ చేసుకోండి. ముఖ్యంగా కరోనా వైరస్ రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిని అటాక్ చేస్తుందని తెలుస్తోంది. కరోనా బారిన పడ్డ వారికి కూడా వైద్యంలో భాగంగా రోగనిరోధక శక్తిని పెంపొందించే ప్రక్రియనే అవలంభిస్తున్నారు. మరి మీలో ఇమ్యూనిటీ పవర్ లక్షణాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందామా..

శరీరంలో దాగున్న రోగ నిరోధక శక్తి మనిషికి రక్షణ కవచంలా పని చేస్తుంది. హానికరమైన వైరస్‌లు, బ్యాక్టీరియాలు, ప్రతి కూల వాతావరణ పరిస్థితుల నుంచి శరీరాన్ని కాపాడుతుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటే త్వరగా జబ్బు పడతారు. సాధారణ వ్యక్తులకు సంవత్సరానికి మూడు సార్లు జలుబు చేస్తే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి అంతకంటే ఎక్కువ సార్లు జలుబు చేయడంతో పాటు కోలుకోవడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్న వ్యక్తులకు ఒక్కోసారి చికిత్స చేయడం కూడా కష్టమవుతుంది.

తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాకపోతే కూడా మీలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నట్లే. తిన్న ఆహారం సరిగా జీర్ణమైతే శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. దాంతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అందువల్ల జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా జాగ్రత్తలు పాటించాలి.

చిన్న పని చేసినా అలసిపోతే వ్యాధి నిరోధక శక్తి లేనట్లే. చిన్న చిన్న వ్యాయామాలు, వాకింగ్ లాంటివి చేస్తే శరీరం త్వరగా అలసటకు గురికాదు.

ఇక ఏదైనా గాయమైతే ఆరోగ్య వంతుల్లో త్వరగా మానిపోతుంది. అదే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి గాయాలు త్వరగా మానవు.

చిన్న విషయానికి కూడా కొందరు ఆందోళన చెందుతుంటారు. మరి కొందరు ఆ సమస్యను ఇట్టే పరిష్కరిస్తారు. ఈ తేడాకి కారణం వారిలో ఉన్న రోగనిరోధక శక్తే. వీటితో పాటు బరువు, శరీరానికి ఎండ తగలకపోవడం వంటివి రోగ నిరోధక శక్తిని క్షీణింపజేస్తాయి. మరి ఎలాంటి పరీక్షలు అవసరం లేకుండానే మీలో ఇమ్యూనిటీ పవర్ ఉందో లేదో తెలిసింది కదా. మంచి ఆహారాన్ని తీసుకుంటూ, తగినంత వ్యాయామం చేస్తే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా విటమిన్ సి ఎక్కువగా ఉండే బత్తాయి, నిమ్మ జాతి పండ్లను ఆహారంలో భాగం చేసుకుంటే రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు.

Tags

Read MoreRead Less
Next Story