సినీనటి వాణిశ్రీ ఇంట్లో విషాదం

సినీనటి వాణిశ్రీ ఇంట్లో విషాదం
X

సినీనటి వాణిశ్రీ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆమె కుమారుడు అభినయ వెంకటేశ కార్తీక్ గుండెపోటుతో మృతి చెందాడు. నిద్రిస్తున్న సమయంలోనే గుండెపోటు వచ్చినట్లు చెబుతున్నారు. అభినయ్ చెన్నైలోని అన్నపూర్ణ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసి..ఊటిలో డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే..ప్యాలెస్ పనుల నిమిత్తం చెంగల్ పట్టుకు వెళ్లాడతను. రాత్రి అక్కడే బస చేశాడు. అయితే..నిద్రలోనే గుండెపోటు రావటంతో మృతిచెందాడు. అభినయ్ మృతదేహాన్ని చెన్నైలోని వాణిశ్రీ ఇంటికి తరలించారు. శనివారం అంత్యక్రియలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. వాణిశ్రీ కుమారుడి మృతి పట్ల సినీ ఇండస్ట్రీ సంతాపం వ్యక్తం చేసింది.

Next Story

RELATED STORIES