కోల్డ్ స్టోరేజీలో పనిచేయని ఏసీలు.. పాడైపోయిన 20 వేల క్వింటాళ్ల మిర్చి

కోల్డ్ స్టోరేజీలో పనిచేయని ఏసీలు.. పాడైపోయిన 20 వేల క్వింటాళ్ల మిర్చి

కోల్డ్ స్టోరేజ్‌లో మిర్చి నిల్వ చేసిన రైతులు నిండా మునిగిపోయారు. అందులో ఏసీలు సరిగా పనిచేయక దాదాపు 20 వేల క్వింటాళ్ల మిర్చి పాడైపోయింది. గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం రెడ్డిగూడెంలోని వెంకటేశ్వర కోల్డ్ స్టోరేజీలో జరిగిందీ ఘటన. వారం రోజులుగా ACలు పనిచేయకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని దీనికి యాజమాన్యమే బాధ్యత వహించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణ జరిపి తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

గిట్టుబాటు ధర వచ్చినప్పుడు అమ్ముకుందామని మిర్చి పంట నిల్వ చేస్తే తీరా ఇప్పుడు ఎందుకూ పనికిరాకుండా పోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. పాడైపోయిన మిర్చిని స్టోరేజ్‌ ముందు ఆరబోశారు. తమకు యాజమాన్యం న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపైనే బైఠాయించి ధర్నాకు దిగారు.

Read MoreRead Less
Next Story