మే 24న ఈద్-ఉల్-ఫితర్

మే 24న ఈద్-ఉల్-ఫితర్

ఈద్-ఉల్-ఫితర్‌ను మే 24న జరపాలని సౌదీఅరేబియాలోని ముస్లిమ్ మతపెద్దలు నిర్ణయించారు. లడఖ్, కార్గిల్ ప్రాంతాల్లో నెలవంక కనిపించడంతో అక్కడ మే 23వతేదీనే ఈద్-ఉల్-ఫితర్ సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించారు. కేరళ, కర్ణాటక ప్రాంతాలో మే 24వతేదీన ఈద్-ఉల్-ఫితర్ జరపాలని నిర్ణయించినట్లు కేరళలోని హిలాల్ కమిటీ పేర్కొంది. ఇండియాలోని మిగతా ప్రాంతాల్లో ఈద్-ఉల్-ఫితర్ ఏ రోజు సెలబ్రేట్ చేసుకుంటారనే విషయం.. శనివారం సాయంత్రం నెలవంక దర్శనంపై ఆధారపడి ఉంటుంది.

ఇక గల్ఫ్ దేశాల్లో.. శనివారం నెలవంక కనిపించే అవకాశముండటంతో మే 24న ఈద్-ఉల్-ఫితర్ సెలబ్రేట్ చేయాలని సౌదీ అధికారులు నిర్ణయించారు. రమజాన్ మాసం ఉపవాసాలు ఈ పండుగతో ముగియనున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా.. ఈద్ ప్రార్థనలతో పాటు పండుగ వేడుకలను ఇంటిలోనే ఉండి చేసుకోవాలని ముస్లిమ్ మతపెద్దలు సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story