లాక్‌డౌన్‌తో మనం సాధించింది తక్కువేం కాదు: సాధికారతా గ్రూప్

లాక్‌డౌన్‌తో మనం సాధించింది తక్కువేం కాదు: సాధికారతా గ్రూప్

దేశంలో కరోనా వ్యాప్తిని లాక్‌డౌన్ సమర్థవంతంగా కట్టడి చేసిందని సాధికారతా గ్రూపు-1 చైర్మన్ డాక్టర్ పాల్ అన్నారు. లాక్‌డౌన్ అమలు చేయకపోతే.. ఈ రోజు కరోనా కేసుల సంఖ్య భయంకరంగా ఉండేదని అన్నారు. సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయం వలన కేసులు సంఖ్య, మరణాల సంఖ్యలోని వృద్ధి కూడా గణనీయంగా తగ్గిందని అన్నారు. లాక్‌డౌన్‌తో మనం సాధించింది తక్కువేం కాదని.. మనం తీసుకున్న నిర్ణయంతో కరోనాను కొన్ని ప్రాంతాలకే పరిమితం అయ్యేలా చేశామని అన్నారు. మొత్తం కేసుల్లో 80శాతం 5 రాష్ట్రాల్లోనే ఉన్నాయని.. 60 శాతం కేసులు 5 నగరాలకే పరిమితమయ్యాయని అన్నారు. దీంతో భవిష్యత్ లో ఎలాంటి ఉపదృవాలు ఎదురైనా ఎదుర్కొనే దైర్యం మనకు వచ్చిందని అన్నారు. లాక్‌డౌన్‌తో పెద్ద ఎత్తన ప్రజల ప్రాణాలు కాపాడుకోగలిగామని, సరైన మార్గంలోనే మనం వెళ్తున్నామనే ఆత్మ విశ్వాసాన్ని నింపిందని డాక్టర్ వీకే పాల్ పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story