లాక్డౌన్‌లో 'లవ్‌స్టోరీ' నిర్మాతతో డిస్కషన్.. శేఖర్ కమ్ముల నెక్ట్స్ మూవీ కన్ఫార్మ్

లాక్డౌన్‌లో లవ్‌స్టోరీ నిర్మాతతో డిస్కషన్.. శేఖర్ కమ్ముల నెక్ట్స్ మూవీ కన్ఫార్మ్
X

సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తర్వాతి సినిమా కన్ఫార్మ్ అయ్యింది. ప్రస్తుతం నాగ చైతన్య, సాయి పల్లవి లతో 'లవ్ స్టోరీ' మూవీ చేస్తున్న శేఖర్ కమ్ముల ఆ మూవీ షూటింగ్ ఇంకో 15 రోజులు అయితే పూర్తవుతుంది. ఇంతలో లాక్డౌన్ వచ్చింది. షూటింగ్ ఆగిపోయింది. అయితే శేఖర్ ఈ లోపు తన తర్వాతి సినిమాను కూడా లాక్ చేసేశారు. అది కూడా ‘‘లవ్ స్టోరీ’’ మూవీ నిర్మాతతోనే. ఓ స్టార్ హీరో ఈ మూవీలో నటించనున్నారని సమాచారం. సినిమా సినిమాకు ఎప్పుడూ గ్యాప్ తీసుకునే శేఖర్ ఈసారి లాక్ డౌన్ బ్రేక్ లో తన తర్వాతి సినిమాకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా పూర్తి చేసుకుంటున్నారు.

లవ్ స్టోరీ మూవీ కంటెంట్ మీదున్న నమ్మకం, శేఖర్ పనితనం నచ్చిన ప్రొడ్యూసర్ నారాయణ్ దాస్ నారంగ్ తమ తరువాతి సినిమా కూడా శేఖర్‌తోనే చేయాలని పట్టుబట్టగా.. ఆయన వెంటనే దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ కరోనా క్రైసిస్‌లో నిర్మాతకు హెల్ప్ అయ్యేలాగా ఇలాంటి డెసిషన్ తీసుకోవటం శేఖర్ కమ్ముల మంచితనం అని అంటున్నారు సినీ వర్గీయులు. లవ్ స్టోరీ సినిమా రిలీజ్ అవ్వగానే ఈ మూవీ పట్టాలెక్కనుంది.

శేఖర్ కమ్ముల స్టైల్లో సాగే ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి బ్యానర్ పై నారాయణ్ దాస్ నారాంగ్ నిర్మించనున్నారు. ఈ మూవీకి సంబంధించి మరిన్ని విషయాలు చిత్ర యూనిట్ త్వరలోనే తెలియజేయనుంది.

Next Story

RELATED STORIES