తాజా వార్తలు

మిమిక్రీ గొంతు మూగబోయింది.. హరికిషన్ కన్నుమూత

మిమిక్రీ గొంతు మూగబోయింది.. హరికిషన్ కన్నుమూత
X

ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ హరికిషన్ కన్నుమూశారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో జాయిన్ అయిన ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. పలువురు సినీ, రాజకీయ నాయకుల వాయిస్‌ను మిమిక్రీ చేసి హరికిషన్ ప్రాచుర్యం పొందారు. 1963 మే 30న ఏలూరులో రంగమణి, వీఎల్ఎన్ చార్యులు దంపతులకు హరికిషన్ జన్మించారు. 1971లో విజయవాడలో హరికిషన్ తొలి మిమిక్రీ ప్రదర్శన చేశారు. దివంగత మిమిక్రీ ఆర్టిస్ట్ నేరెళ్ల వేణుమాధవ్ స్పూర్తితో ఆయన మిమిక్రీ రంగంలోకి అడుగుపెట్టినట్లు చెబుతుండేవారు. దేశ విదేశాల్లో 10వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. 12 ఏళ్ల పాటు టీచర్‌గా పని చేసిన హరికిషన్, హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో మిమిక్రీ లెక్చరర్‌గా పని చేశారు.

Next Story

RELATED STORIES