అంఫన్ తుపాన్‌ను జాతీయ విపత్తుగా ప్రకటించాలి: ప్రతిపక్ష పార్టీలు

అంఫన్ తుపాన్‌ను జాతీయ విపత్తుగా ప్రకటించాలి: ప్రతిపక్ష పార్టీలు
X

ఆంఫన్ తుపానును జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రతిపక్షపార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. ఆంఫన్ తుపానుతో రెండు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయానని.. ఈ విపత్తును ఎదుర్కోవాలంటే కేంద్రం సాయం తప్పనిసరని.. ఒడిశా, బెంగాల్ కు భారీగా సాయపడాలని కోరాయి. కాంగ్రెస్ అధ్యక్షరాలు సోనియా గాంధీ పిలుపు మేరక 22 ప్రతిపక్ష పార్టీలు వీడియో కాన్ఫరెన్స్ లో సమావేశం అయ్యాయి. ఈ సమావేశంలో ఈమేరకు కేంద్రం ముందు తమ ప్రతిపాదన ఉంచాయి. ఇరు రాష్ట్రాలలో భారీగా ఆస్థి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా సంభవించింది. రెండు రాష్ట్రాల ప్రజలకు, ప్రభుత్వాలకు.. ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. ఈ సమావేశంలో కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, టీఎంసీ సహా మొత్తం 22 ప్రతిపక్షపార్టీ నేతలు పాల్గొన్నాయి.

Next Story

RELATED STORIES